ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం డిమాండ్
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–2024 టీచ ర్ రిక్రూట్మెంట్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొంగల వెంకట్, సుభాష్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం బాధిత అభ్యర్థులతో కలిసి వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులతో మాట్లాడారు. పలు జిల్లాల్లో ఓపెన్ మెరిట్ కోటాలో సెలెక్ట్ అయిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేట గిరీలో సెలెక్ట్ చేశారని తెలిపారు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు. సెలెక్షన్కు ముందే లోకల్ బా డీ, గవర్నమెంట్ ఆప్షన్ అడగడంతోనూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరిగిందన్నారు.